Thursday, June 18, 2015

పేజిమేకర్ ప్రాథమిక పరిగ్జ్నానం (Introduction)

మీరు start > programs > adobe > pagemaker మీద క్లిక్ చేస్తే మీ ముందు ఈ క్రింది విధంగా తెర కనిపిస్తుంది. అందులో వివిధ పరికరాల గురించి వివరించబడింది.


పై Imageలో pagemaker స్టాట్ చేయగానే మనకు కనబడే ఆప్షన్స్ గురించి తెలుసుకున్నారు కదా!.

ఇంక పేజిమేకర్ లోని Menuల గురించి, ఆప్షన్ల గురించి, Shortcuts గురించి, చేయవలసిన ఎక్సర్సైజులు, పేజిమేకర్ షార్ట్కలు గురించి తెలుసుకోవడానికి పేన మెనూను FOLLOW అవండి.
Continue Reading...

Saturday, September 19, 2009

వ్యూ మెనూ (View Menu)

మ్యాటర్ను కాని, Image(బొమ్మ)లను కాని అసలైన సైజు, చిన్న సైజు, కావాల్సిన సైజు కంటే ఎన్నో రెట్లు పెద్ద సైజు, జూమ్ లో చూడటం లాంటివి పేజిమేకర్ లో కూడా వీక్షించవచ్చు. విధంగా వివిధ రూపాలలో చూపించే ఆప్షన్లు లో లభ్యమవుతాయి.

Actual Size (Ctrl+1)
మనం టైప్ చేసేటపుడు పేజిమేకర్లో పేజి పెద్దదిగా లేక చిన్నదిగా కన్పించవచ్చు.
అసలు పేజిమేకర్ లో పేజి మనకు ఎలా ఉంటుందో చూపడానికి view>actual size ని క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.



Fit in window (Ctrl+0)
ఒకోసారి మనం పేజిని లేదా బొమ్మని జూమ్ చేసినపుడు లేదా 100 శాతం కంటే పెద్ద సైజులో చూసినపుడు అది పేజిమేకర్ పరిధి దాటిపోతుంది. దానిని తిరిగి యధాస్థితికి తేవడానికి Fit in window మీద క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు.


Zoom in
పేజిమేకర్లో డాక్యుమెంట్ లేదా బొమ్మలను మనం కావాల్సి సైజులో జామ్లో చూడడానికి మనం దీని మాద క్లిక్ చేయవచ్చు. ఇంకా పెద్దది కావాలంటే మరోసారి Zoom in మీద క్లిక్ చేయవచ్చు. అలా 400 శాతం వరకూ ఈ zoom in ద్వారా ప్రతిబింబాన్ని పెద్దది చేసి చూడవచ్చు.


Zoom out
Zoom inలో పెద్ది చేసిన ప్రతిబింబాన్ని తిరిగి చిన్నది చేసి చూడటానికి ఈ zoom out ఆప్షన్ని ఉపయోగిస్తారు.


Display Master Items
మన డాక్యుమెంట్ని ప్రింట్ చేస్తే ఏమేమి ఐటమ్స్ వస్తాయో చూడటానికి ఈ Display Master Items ఆప్షన్ ని ఉపయోగిస్తారు.

Display non-printing items
ఒకోసారి మనం చేసిన అన్నిరకాల ఐటమ్లు ప్రింటింగ్లో రావు. అలాంటి వాటిని తెలుసుకోవడానికి ఈ display non-printing items ఆప్షన్ ని ఉపయోగిస్తారు.

Hide Rulers
పేజిమేకర్ని డాక్యుమెంట్లో ఉండే లైనులు (Rules) కన్పించకుండా చేసి ఆప్షన్ ఇది. అలాగే Guides సైతం అవసరం లేదనుకుంటే view>hide Guides ద్వారా తెరమీద నుండి తొలగించవచ్చు.
Shortcuts:
Rules = Ctrl+R
Guides = Ctrl+;

unique statistics

Continue Reading...

Friday, August 14, 2009

లేఅవుట్ మెనూ (Layout Menu)

పేజిమేకర్ ఓపెన్ చేసినపుడు వచ్చే తెరను పేజిగా పరిగణిస్తారు. పేజి సైజు, పరిమాణం మొదలైన విషయాలనునిర్దారించే మెనూనే Layout మెనూ అంటారు. Layout మెనూలోని రకరకాల ఆప్షన్లను తెలుసుకొని వాటి ద్వారాడాక్యుమెంట్లని మరింత అందంగా తీర్చిదిద్దవచ్చు.

Go to Page (Ctrl+Alt+G)
కొన్ని వందల పేజీల్లో కావల్సిన పేజీని ఎన్నకోవడానికి go to page ఆప్షన్ ని ఎన్నుకుంటారు. ఉదాహరణకు మీరు పేజీలోఉన్నారు. ఉన్నట్లుండి మీరు 6 పేజీకోని మ్యాటర్ ని చూడాలనుకున్నారు. అందుకు మనం layout>go to page మీద క్లిక్ చేస్తే క్రింది తెర వస్తుంది.
80



ఫలితంగా మీరు వెంటనే ఆ పేజిలోకి అడుగుపెడతారు.
అలాకాకుండా మరో పద్దతి ఏమిటంటే డాక్యుమెంట్ క్రింద రూలర్లో కన్పించే పేజీల మీద మౌస్ తో కావలసి పేజి నెంబర్ మీద క్లిక్ చేస్తే ఆయా నెంబర్ గల పేజిలోకి నేరుగా ప్రవేశించవచ్చు.


Insert Pages (అదనంగా పేజీలను కలపడం)
మనం ఎక్కువుగా పేజీలు టైప్ చేశాం. ఉన్నట్లుండి మధ్యలో కొన్ని పేజీలు కలపాల్సి ఉంది. అప్పుడు layout>insert page ఏం చేయాలంటే మీద క్లిక్ చేస్తే ఈ క్రింద బొమ్మలో లాగా బాక్స్ ప్రత్యక్షమవుతుంది.


ఏ పేజి ముందు (before current page) కావాలో, లేదా ఏ పేజి తర్వాత (after current page) కావాలో అక్కడ తెలపాలి. ఫలితంగా మీకు అదనంగా ఆ పేజీలు మధ్యలో కలపబడతాయి.

Remove Pages (అవసరం లేని పేజీలను తీసేయడం)
ఒకోసారి కొంత మ్యాటర్ ని తొలగించాల్సి వస్తుంది. తొలగించిన కారణంగా కొన్ని పేజీలను తీసెయాల్సి వస్తుంది. అందుకు ఉపయోగపడే ఆప్షనే Remove Pages.
దీనిని తెరవాలంటే layout>remove pages మీద క్లిక్ చేస్తే ఈ క్రింది విధంగా తెర కనిపిస్తుంది.
మీకు అవసరం లేని పేజీలను తొలగించిన వెంటనే వాటి తర్వాత పేజీలు వాటంతట అవే మిగతా మ్యాటర్ని, బొమ్మలను అవే సర్దుబాటు చేసుకుంటాయి.


గమనిక: డాక్యుమెంట్ లేదా ఫైల్ క్రింద రూలర్లో కన్పించే పేజీల మీద మౌస్ తో రైట్ క్లిక్ చేస్తే Add one page, Insert Pages, Remove Pages ఆప్షన్లలలో కావలసిన దానిలోనికి నేరుగా వెళ్ళవచ్చు.

Sorting Pages
పేజీలను ఒక ప్రత్యేకమైన వరుసలో ఉంచటాన్నే shorting అంటారు. ఈ shorting pages ఆప్షన్ వల్ల మన డాక్యుమెంట్ లోని పేజీలను ఒక క్రమబద్దమైన ఆర్డర్ లో ఉంచడం తేలికవుతుంది. Layout>sort pages మీద నొక్కడం వల్ల ఈ క్రింది ఆప్షన్ లభ్యమవుతుంది.
పై బొమ్మలోని అనేక రకాలైన డాక్యుమెంట్లను మనకు కావాల్సిన వరుసలో ఉంచడానికి మౌస్ సహాయంతో ఆ డాక్యుమెంట్ మీద నొక్కి డ్రాగ్ చేసి ఇతర చోటుకు గాని, ప్రక్క పేజీల వద్దకు కాని తీసుకువెళ్ళవచ్చు. అలా పేజీలన్ని కావాల్సిన రీతిలో సర్దబాటు చేయవచ్చు.



Column Guides
ఒకసారి మన టెక్స్ట్ మొత్తం పేజిల్లోని వివిధ కాలమ్ లలో రావాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు తెలుగు వారపత్రికలు చూసినట్లయితే నిలువుగా ఉన్న కాలమ్ లలో మ్యాటర్ ఉంచడం చేసే ఉంటారు. అలా మ్యాటర్ కాలమ్ లలో రావాలంటే ఈ columns guidesమీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఫలితంగా మీ ముందు ఈ క్రింది బాక్స్ వస్తుంది.


పై బాక్స్ లో మొదటగా మీకు పేజికెన్ని కాలమ్ లు కావాలో పేర్కొని ఆ తర్వాత OK మీద క్లిక్ చేస్తే ఆయా కాలమ్ లు మీ పేజిల్లో ఇలా ప్రత్యక్షమవుతాయి.


Autoflow
ఒక పేజీ లేదా ఫేరాగ్రాఫ్ లో ఎక్కవ మ్యాటర్ ఉన్నపుడు ఆ పేజి లేదా ఫేరాగ్రాప్ నిండగానే, మరుసటి పేజి లేదా పేరాగ్రాఫ్ కి మ్యాటర్ తనంతటతానే వెళ్ళడానికి ఈ Autoflow ఆప్షన్ ని ఉపయోగిస్తారు. చేయాల్సిందల్లా మ్యాటర్ ఎక్కడనుండి ప్రారంభం కావాలో టూల్ బాక్స్ లో టెక్స్ట్ టూల్ ద్వారా సూచించాలి.

చూసిన వారి సంఖ్య

Counter
Discount Computer



Continue Reading...

Thursday, July 30, 2009

పేజిమేకర్లో ఎలిమెంట్స్ మెనూ గురించి తెలుసుకుందాం (Elements Menu)

మనం డ్రా చేసిన లైన్స్ కు, బాక్స్ లకు కలర్ అప్లై చేయాలన్నా, లైన్ల మందం పెంచాలన్నా మనకు ఎలిమెంట్స్మెనూలోని ఆప్షన్లు ఉపయోగపడతాయి. మరీ మెనులో వాటి గురించి తెలుసుకుందాం.

Fill కమాండ్


ఒక బాక్స్ షేప్ గీసి దాన్ని సెలక్ట్ చేసి Fill కమాండ్లోకి వెళ్ళి అందులో ఉన్న ఆప్షన్లను క్లిక్ చేస్తే బాక్స్ లోపలి భాగంలో డిజైన్స్ అప్లయి అవుతాయి. వాటిని క్రింద గమనించండి.


లైన్ లేదా స్ర్టోక్ (Stroke)
మనం తీసుకున్న బొమ్మలు, బాక్స్లు చుట్టూ బోర్డర్ లాగా లైన్ గీస్తాం. ఆ లైన్ యొక్క మందం ఈ మెనూ ద్వారా పెంచుకోవచ్చు, తగ్గిచ్చుకోవచ్చు. Element>Stroke మీద క్లిక్ చేస్తే క్రింది విధంగా కనిపిస్తుంది.

వాటిలో మీకు ఎంత మందం కావాలో సెలక్టు చేసుకోవచ్చు. అంతే కాకుండా Custom ఆప్షన్ ద్వారా మీకు కావలసినంత మందంను కూడా సెట్ చేసుకోవచ్చు.
ఉదా: 3 లైన్ల మ్యాటర్ టైప్ చేసి, ఒక బాక్స్ గీసి దానికి 2pt. మందం అప్లయి చేయండి. టైప్ చేసిన మ్యాటర్ లేయర్ను ఆ బాక్స్లోకి తీసుకురండి. అప్పుడు క్రింది విధంగా ఉంటుంది.


Fill and Stroke
Element>Fille and Stroke క్లిక్ చేయడం ద్వారా ఈ క్రింది ఆప్షన్ను పొందవచ్చు.
Shortcut : Ctrl+U


Arrange
ఈ కమాండ్ ద్వారా మనం రెండు లేదా అంత కంటే ఎక్కువ లేయర్లను తీసుకున్నపుడు వాటిని క్రిందికి, పైకి మార్చుకోవడానికి ఈ కమాండ్ ఉపయోగపడుతుంది. వీటిలో ఉపయోగపడే ఆప్షన్లు గురించి తెలుసుకుందాం.

Bring to Front ( Shift+Ctrl+] )
ఒక లేయర్ని(టెక్ట్స్, ఇమేజ్, బాక్స్ ఏదైనా సరే) సెలక్ట్ చేసుకుని Bring to Front క్లిక్ చేయడం వల్ల అన్ని లేయర్ల కంటే ముందు ఉంటుంది.


Send to Back (Shift+Ctrl+[ )
ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే అన్ని లేయర్ల కంటే వెనక్కి వెళుతుంది.


Align Objects (Shift+Ctrl+E)
రెండు Objects ను తీసుకుని సెలక్ట్ చేసి Align Objects ఆప్షన్ క్లిక్ చేస్తే తదనుగుణంగా క్రింది విధంగా విండో ఓపెన్ అవుతుంది. దానిలో కుడి ప్రక్క, ఎడమ ప్రక్క మీకు నచ్చిన ఆప్షన్స్ సెట్ చేసి Ok చేయండి. మీరు తీసుకున్న Objectsని గమనించండి.


గ్రూప్ చేయడం (Ctlr+G)
మనం డాక్యుమెంట్లో ఉపయోగించిన లేయర్లను అన్నింటిని లేదా మనకు కావలసిన వాటిని సెలక్టు చేసుకుని Group క్లిక్ చేస్తే అన్ని ఒక లేయర్ క్రింద మారిపోతుంది.

Ungroup (Shift+Ctlr+G)
గ్రూప్ చేసిన దానిని క్లిక్ చేసి Ungroup ఆప్షన్ క్లిక్ చేస్తే మరళ తిరిగి విడి విడి లేయర్లగా మారిపోతుంది.

Mask (Ctlr+6)
ఒక బాక్స్, ఒక ఇమేజ్ తీసుకోండి. బాక్స్ పై ఇమేజ్ను ఉంచండి.
రెండిటిని సెలక్ట్ చేసి Mask అప్లై చేయండి అపుడు ఎంత పెద్ద ఇమేజ్ అయినా మీరు తీసుకున్న బాక్స్ షేప్లో మాత్రమే కనబడుతుంది. తరువాత ఇమేజ్ ఏ భాగం కనబడాలో జరుపుకుంటే సరిపోతుంది. అలాగే చిన్నగా కనబడాలంటే సైజు తగ్గించుకుంటే సరిపోతుంది.


Unmask (Shift+Ctlr+6)
మాస్క్ చేసిన వాటికి మాస్క్ ను తొలగించడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది.

Rounded Corners
ఒకోసారి మనకు బాక్స్ చివరల గుండ్రంగా కావాల్సి ఉంటుంది. ఉదాహరణకు క్రింది బాక్స్ని చూడండి.


ఇలా రావడం కోసం ఒక బాక్స్ డ్రా చేసి Elecments>Round Corners క్లిక్ చేస్తే వచ్చే మెనూలో ఒకదాన్ని సెలక్ట్ చేసుకోని Ok చేయండి.


Text Wrap
Text Wrap గురించి ఇక్కడ క్లిక్ చేసి వివరంగా తేలుసుకోండి.

చూసిన వారి సంఖ్య

Counters

Continue Reading...

Saturday, July 25, 2009

పేజిమేకర్లో Text వ్రాప్ గురించి తెలుసుకుందాం

మనం తయారు చేసే పేజీలో మ్యాటర్, బొమ్మలు రెండూ ఉంటాయి. అయితే మ్యాటర్ మధ్యలో బొమ్మని ఉంచేటపుడు బొమ్మని పేజీ మధ్యలో పొజిషన్ లో (మధ్యన లేదా చివరనా) అన్న సందేహం వస్తుంది. బొమ్మ చుట్టూ ఎంతరూరంలో మ్యాటర్ ఉండాలన్న సందేహం రావచ్చు. సమస్యం పరిష్కారానికే వెలువడిన ఆప్షనే Text Wrap. టెక్స్ట్, బొమ్మలు ఒకదానికి ఒకటి సంఘర్షణకి గురికాకుండా కాపాడేదే Text Wrap.
ఉదహరణకు క్రింది బోమ్మను గమనించండి


ఇక్కడ ఒక కథకు సంబంధించిన మేటర్ ప్రక్కనే దానికే చెందిన ఇలస్ర్టేషన్ ఉన్నాయి.
>Layout>Coloumn Guides వెళ్ళి పేజీకి 2 Columns ఇవ్వండి.
ఇలస్ర్టేషన్కు రెండు కాలమ్స్ మధ్యకు తీసుకువచ్చి ఇలస్ర్టేషన్ అవుట్లైన్ చుట్టూ మేటర్ అమర్చాలంటే Text Wrap కమాండ్ ఉపయోగించాలి. పేజిమేకర్లోని ముఖ్యమైన వాటిలో ఇది ఒకటి.
తరువాత Text Wrap కమాండ్ ఇవ్వడానికి ముందు Text మొత్తాన్ని Ctrl+A ద్వారా సెలెక్టు చేసుకుని (Text కర్సర్ మేటర్ పై ఉండాలి) Type మెనూలోకి వెళ్లి >Alignment>Justify (Shift+Ctrl+J) కమాండ్ ఇవ్వండి.
ఇలస్ర్టేషన్ను కాలమ్స్ మధ్యకు తీసుకురావాలి. ఇలస్టేషన్ సెలెక్ట్ చేయబడి ఉండగానే Element మెనూకు వెళ్లి Text Wrap క్లిక్ చేస్తే క్రింది విధంగా బాక్స్ వస్తుంది.


పేన వరుసలో మూడు ఆప్షన్లు ఉంటాయి.
వాటిలో మీకు కావాల్సిన దానిని క్లిక్ చేస్తే టెక్ట్స్ ఆ బొమ్మ ప్రక్కలకు పోతూ ఉంటుంది.
క్రింది వరుసలో వున్న మూడు ఆప్షన్లలో కూడా కావాల్సిన దానిని క్లిక్ చేయాలి.

Text Wrap సెట్టింగ్ పేజిలో Wrap Option వద్ద భాగంలో మధ్యనున్న ఐకాన్పై క్లిక్ చేసి ఒక ఆప్షన్ను ఎన్నకుందాం. Stand off in MM వద్ద Tab కీ అన్నివైపులా ఇవ్వండి. డిఫాల్ట్గా ఉన్న వాల్యూ బదులుగా ఇవ్వాలి. Tab కీ ఉపయోగిస్తూ ఒక దాని నుండి మరొకదానికి సెలెక్టు చేసుకుంటూ వెళ్లవచ్చు. ఇప్పుడు Ok చేయండి.
ఇమేజ్పై పై కమాండ్ అప్లయి చేయబడి కనబడుతుంది.
బొమ్మ చుట్టూ చుక్కలతో ఒక రెక్టాంగిల్ సెకెక్షన్ కనపబడుతుంది. దీనికి నాలుగు మూలలా 4 నోడస్ ఉంటాయి. పాయింటర్ను ఎడమవైపు పై భాగంలో ఉన్న నోడ్ వద్దకు తీసుకువెళ్ళి మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి లోపలివైపు డ్రాగ్ చేయండి.
ఇప్పుడు చుక్కలతో కనపడుతున్న సెలెక్షన్ ఎక్కడైనా మౌస్తో క్లిక్ చేసి నోట్స్ క్రియేట్ చేయవచ్చు. అలా క్రియేట్ చేసిన నోడ్స్ను మౌస్ పాయింటర్తో ఏ దిశలోనైనా డ్రాగ్ చేయవచ్చు. బొమ్మ అవుట్ లైను వంపు తిరిగిన ప్రతిచోట నోట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇలస్ర్టేషన్ అవుట్ లైను చుట్టూ అవసరమైన చోటల్లా నోడ్స్ క్రియేట్ చేస్తూ టెక్ట్సును బొమ్మ చుట్టూ అమర్చాలి. Text Wrap కమాండ్ ఇచ్చిన తరువాత కూడా బొమ్మను సెలక్టు చేసుకుని పైకి లేదా ప్రక్కలకు జరుపుకునే వీలుంది.
బొమ్మ 2 లో చూపించిన విధంగా వోవెల్ చుట్టూ Text Wrap కమాండ్ ఇవ్వవలసి వచ్చినపుడు మధ్య భాగంలో ఉన్న హెడ్డింగ్ స్ర్ఫింగ్ వోవెల్ స్ర్పింగ్ బయటికి మించి ఉండరాదు.

Text Wrap గురించి మరింత సమాచారం కోసం లో దీనికి సంబంధించిన ఒక ట్యుటోరియల్ను ఇక్కడ క్లిక్ చేసి చూడండి.
ఈ ఫోరమ్ లో చూడాలంటే రిజిస్ర్టేషన్ తప్పనిసరి.

చూసినవారి సంఖ్య

MySpace Hit Counters

Continue Reading...

Wednesday, July 22, 2009

పేజిమేకర్లో మ్యాటర్ను పేజీలలో సెట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం?

పేజిముకర్లో పేజీలను సెట్ చేసుకున్న తరువాత మ్యాటర్ను పేజీలలో సెట్ చేయడం ఇప్పుడు తెలుసుకుందాం.
1). మ్యాటర్ పేజి లోపలి భాగం దాటినపుడు క్రింద విధంగా ఉంటుంది.

2). సెలక్షన్ టూల్తో మ్యాటర్ లేయర్ మధ్య భాగానా క్లిక్ చేసి పట్టుకుని పేజిలో చివరి భాగం వరకు కాని లేదా మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు జరపండి.


3). అపుడు సెలక్ట్ చేసిన భాగం మధ్యలో రెడ్ కలర్లోకి మారుతుంది.


4). సెలక్షన్ టూల్తో ఆ రెడ్ కలర్ మీద క్లిక్ చేసి తరువాతి పేజి మొదటి భాగంలో క్లిక్ చేస్తే మొదటి పేజిలోని తరువాతి మ్యాటర్ ఆ పేజిలోకి వస్తుంది.


5). అలా కాకుండా మొదటి పేజిలో కొన్ని వందల లైన్లు ఉన్నాయనుకోండి అప్పుడు Layout>Autoflow ఆప్షన్ క్లిక్ చేసి మ్యాటర్ను తరువాత పేజిలో ఇన్సర్ట్ చేస్తే మ్యాటర్ ఎన్ని పేజీలకు సరిపోతుందో అన్ని పేజీలు ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి.





చూసిన వారి సంఖ్య

new styles
Color

Continue Reading...

Saturday, July 18, 2009

పేజిమేకర్ అక్షరాలను ఆకర్షణాయంగా తీర్చిదిద్దడం (Type Menu)

మెనూ ద్వారా ఉన్న అక్షరాలను (ఫాంట్)ని మార్చేయడం, చిన్న అక్షరాలను పెద్దవిగా చేయడం, అద్బుత అక్షణాలతోడాక్యుమెంట్ని ఇంకా అందంగా తీర్చిదిద్దవచ్చు.

ఫాంట్ ఆదేశం (Font Command)
పేజిమేకర్ లో Type మెనూలో Font ని క్లిక్ చేయగానే రకరకాల ఫాంట్లు మీ కళ్ళముందు ప్రత్యక్షమవుతాయి.



కావాల్సిన సమాచారాన్ని సెలక్ట్ చేసుకుని వాటిలో మీకు ఇప్టం వచ్చిన ఫాంట్ను ఎన్నకోవచ్చు.

సైజు (Size Command)
కేవలం రకరకాల అకృతులు ఉన్న ఫాంట్లే కాకుండా వాటి సైజు సైతం మనం మార్చుకోవచ్చు. మీరు పుస్తకాలలో పేరాగ్రాఫ్లు కొన్ని పెద్దవిగా, మరికొన్ని చిన్నవిగా ఉంటాయి. ఇక్కడ ఫాంట్ సైజులను రకరకాల సంఖ్యలో కొలుస్తారు. Type>Size ని క్లిక్ చేయడం ద్వారా ఎన్నుకోవచ్చు. ఉదాహరణకు క్రింద చూడండి.
ఈ ఫాంట్ సైజులు, ఆకృతులను మనం Control Palette లోని బాక్స్ ద్వారా కూడా ఎన్నుకోవచ్చు.


Leading
లైనుల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని Leading అంటారు. పేజిమేకర్లో అక్షరం అక్షరం మధ్య ఖాళీని పెంచవచ్చు. తగ్గించవచ్చు. ఈ Leading ఆప్షన్ని ఉపయోగించి ఒక పేజిలో ఖాళీని బట్టి మ్యాటర్ని పెంచవచ్చు. ఒక పేజికి సాధారణంగా 33 లైనులు పడుతాయి. అయితే మనకు 35 లైనులు కావాలనుకోండి. అలాంటపుడు ఒక అక్షరం మరో అక్షరం మధ్య గాప్ను తగ్గించి 35 లైనులు వచ్చేలా చేయవచ్చు. దీనికోసం Leading ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా కనిపించే వాటిలో సైజు ఎన్నుకొని లీడింగ్ పెంచవచ్చు, తగ్గించవచ్చు.
ఉదాహరణకు ఒక్కో సైజు ఎంతంత పరిమాణంలో వస్తుందో చూడండి.

పై బాక్సులో మీకు కావాల్సిన Font పేరు, Font Size, Leading, కలర్స్ లాంటి వాటిని ఎన్నుకొని OK క్లిక్ చేస్తే సరిపోతుంది.

కెర్నింగ్
కొన్ని పదాలు లేక అక్షరాలు ఎక్కువగా పొడవు సాగి ఉంటాయి. అంటే అక్షరాల మద్యన అవి ఎక్కువ స్థానాన్ని తీసుకుంటాయి. అలాంటి వాటిని సరిచేయటానికి పేజిమేకర్లో కెర్నింగ్ ఆప్షన్ వాడతాము.
ఉదాహరణకు క్రింద చూడండి.


Tracking
ఒకో పదం లేదా వాక్యాల మధ్యన ఉన్న గ్యాప్ని సమాంతరం చేయడానికి ప్రక్రియి ఉపయోగిస్తారు. కెర్నింగ్ని రెండు అక్షరాల మధ్య గ్యాప్ ని సమాంతరం చేయడానికి చేయడానికి ఉపయోగిస్తారు.

Alignment (సమాచారాన్ని సర్దుబాటు చేయడం)
అక్షరాలతో పాటు మన డాక్యుమెంట్లోని పేరాలన కూడా పొందికగా అమర్చుకోవడానికి మనకు సాధ్యమయ్యే సాధనాన్ని అలైన్మెంట్ అంటారు. పేరాగ్రాఫ్లను మన అభిరుచికి తగినట్లుగా కుడి, ఎడమ, మధ్యలకు మార్చుకోవచ్చు.
Shortcuts
Left = Shift+Ctl+L
Right = Shift+Ctl+R
Center = Shift+Ctl+C
Justify = Shift+Ctl+J

కావాలసిన మ్యాటర్ను సెలక్ట్ చేసి ఈ ఆప్షన్ను ఉపయోగించండి.

పారాగ్రాఫ్ స్పెసిఫికేషన్
మనం టెక్ట్స్ ని టైప్ చేసేటుపుడు ప్రతి పేరాగ్రాఫ్కి ఓ హెడ్డింగ్ని ఉంచుతాం. ఉదాహరణకు ఈ క్రింది మ్యాటర్ను గమనించండి.


ఈ హెడ్డింగ్కి, దాని క్రింది మ్యాటర్కి మధ్య ఎంత గ్యాప్ ఉండాలో అనే దానికి మనం ని ఉపయోగించి చూడాలి. దీనిలో ఎడమవైపు స్థలం ఎంత దానిలో మీకు కావల్సిన స్థలం (2 సం. ఎం. లేదా 3 ఎం. ఎం.) ఇవ్వండి. వెంటనే ఆ స్థలం దాని గ్యాప్ తదనుగుణంగా మారిపోతుంది.

Indents / Tbas


పై మ్యాటర్ మధ్య ఖాళీలు సరిగ్గా అంతే విధంగా రావాలంటే మనం చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఒక కాలమ్కి మరో కాలమ్కి మధ్య అంతే గ్యాప్ని ఉంచాలంటే ప్రతిసారి కర్సర్ని అక్కడ ఉంచి టైప్ చేయాల్సి ఉంటుంది. అయినా అవి సరైన వరుసలో రాకపోవచ్చు. ఈ నేపధ్యంలో ఆయా వరసల మద్య గ్యాప్ని సమతుల్యంలో ఉంచడానికి మనకు ఉపయోగపడే ఆప్షన్ పేరే Indents / Tab.

మీరు ఇలా చేయడం కోసం మీకు గ్యాప్ కావలసిన చోట ప్రెస్ చేసి టైప్ చేయండి. తర్వాత మెనూబార్లోని Type>Indents/Tab మీద క్లిక్ చేస్తే ట్యాబ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మనం ట్యాబ్ ఇచ్చిన చోట విధంగా ఉంటుంది. దానిని జరుపుతూ గ్యాప్ ను పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు.



ట్యాబ్ సెట్టింగ్ గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోవడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి.

http://mahigrafix.com/forums/showthread.php?tid=887&pid=1493#pid1493



Free Counters

Continue Reading...

Grab this Widget ~ Blogger Accessories